సోమాజిగూడ(హైదరాబాద్): హైదరాబాద్ నగరం మరో భారీ ఐటీ ఎగ్జిబిషన్‌కు వేదికగా నిలవనుంది. వచ్చే నెల సెప్టెంబర్ 25, 26, 27వ తేదీలలో హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ‘ఐటీ ఏషియా- 2015’ పేరుతో ఎంఏఐటీతో కలసి భారీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు రాష్ట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.
గురువారం బేగంపేట హరితా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఎంఏఐటీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్వర్ షిర్‌పూర్‌వాలాతో కలసి ఆయన వివరాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 సంస్థలు, ఆరు రాష్టాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఐటీ రంగంలోని కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు రకాల కంపెనీలను ఒకే వేదికపై తేవడానికి, మరింత సమర్దవంతంగా అనుసంధానం కల్పించడానికి ఎగ్జిబిషన్ నిర్వహణ దోహదం చేస్తుందన్నారు.
సెప్టెంబర్‌లో హైదరాబాద్ వేదికగా మరో భారీ ఎగ్జిబిషన్
Published Thu, Aug 6 2015 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement