తూర్పు సియంగ్ జిల్లాలోని లికాబాయ్లో ప్రవేట్ పాఠశాల హాస్టల్లోని 14 మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన వార్డెన్ విపిన్ విశ్వన్ను అరెస్ట్ చేసినట్లు అరుణాచల్ ప్రదేశ్ ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. అతనితోపాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఇద్దరు పాఠశాల సిబ్బందిని కూడా అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు. అయితే ఈ ఘటన సంబంధం ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు, విద్యార్థులు, పౌర సంఘాల ప్రతినిధులు లికాబాయ్ పోలీస్ స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు.
కాగా వార్డెన్ విపిన్ చేతిలో అత్యాచారానికి గురైన వారంతా 4 నుంచి 13 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలే అని ఉన్నతాధికారులు వివరించారు. మంగళవారం కొంత మంది విద్యార్థినిలు హస్టల్ గోడ దూకి వార్డెన్ జరుపుతున్న అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. గతమూడేళ్లుగా వార్డెన్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినిలు తమకు చేసిన ఫిర్యాదులో తెలిపారని వెల్లడించారు.
ద అరుణాచల్ లా స్టూడెంట్స్ యూనియన్, గాలో స్టూడెంట్స్ యూనియన్, అల్ గాలో స్టూడెంట్స్ యూనియన్లు చిన్నారులపై అత్యాచార ఘటన్ని తీవ్రంగా ఖండించాయి. ఆ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు కాకుండా కఠినమైన శిక్ష విధించాలని అయా సంఘాలు డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
మైనర్లపై అత్యాచారం కేసులో వార్డెన్ అరెస్ట్
Published Wed, Aug 28 2013 4:01 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement