బిడ్డలను వదిలేసి.. ఉగ్రవాద సంస్థలోకి... | Australian Mother Abandoned Her 2 Children to Join Islamic State | Sakshi
Sakshi News home page

బిడ్డలను వదిలేసి.. ఉగ్రవాద సంస్థలోకి...

Published Tue, May 26 2015 12:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

బిడ్డలను వదిలేసి.. ఉగ్రవాద సంస్థలోకి...

బిడ్డలను వదిలేసి.. ఉగ్రవాద సంస్థలోకి...

మెల్ బోర్న్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు ఓ ఆస్ట్రేలియన్ మహిళ తన ఇద్దరు బిడ్డలను వదిలేసింది. ఈ విషయం ఆమె సోదరితో చెప్పి తానిక ఎప్పటికీ ఇంటిమొఖం చూడనని చెప్పి వెళ్లిపోయింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం జాస్మానియా మిలోవానోవ్(26) అనే మహిళ తాను ఐఎస్లో చేరబోతున్నట్లు పరోక్షంగా ఇంట్లో వాళ్లకు చెప్పినట్లు తేలింది.

అదే విషయం తన మాజీ భర్తకు కూడా తెలియజేసినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా ఆమె సిడ్నీ విడిచి వెళ్లిపోయాక పోలీసులు దర్యాప్తు చేపట్టారని, ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు వెలుగుచూస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఘటనపై ఆమె మాజీ భర్త మాట్లాడుతూ' ఆమె చేసిన పనికి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇప్పుడు నా చిన్నారుల గురించే ఆలోచిస్తున్నాను. వారిని వదిలి ఎలా వెళ్లబుద్దయిందో అర్థం కావడం లేదు' అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement