'గోల్డెన్ గన్ తో బ్యాడ్ షాట్'
'గోల్డెన్ గన్ తో బ్యాడ్ షాట్'
Published Tue, Feb 18 2014 2:09 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
'గోల్డెన్ గన్ తో బ్యాడ్ షాట్' అని బాలీవుడ్ విశిష్ట నటుడు నానా పాటేకర్ వ్యాఖ్యానించారు. కాదర్ పూర్ లోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ లో నిర్వహిస్తున్న జీవి మావలంకర్ ఓపెన్ నేషనల్ షూటింగ్ చాంఫియన్ షిప్ పోటీలలో నానా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఒలంపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన గగన్ నారంగ్ రైఫిల్ తో షూటింగ్ చేసిన నానా అత్యల్ప స్కోరును సాధించారు. 300 మీటర్ల బిగ్ బోర్ ఫ్రీ రైఫిల్ విభాగంలో 450 పాయింట్లు సాధించారు.
నారంగ్ రైఫిల్ తో పోటీలో పాల్గొన్నాను. వాతావరణం చాలా చల్లగా ఉంది. వేగంగా గాలి విస్తోంది. నారంగ్ కు పతకాన్ని అందించిన గోల్డెన్ గన్ తో చెత్త షాట్స్ కొట్టాను అని నానా తెలిపారు. ఫిబ్రవరి 19 తేది వరకు కొనసాగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 600 మంది షూటర్లు పాల్గొంటున్నారు. ఈ పోటిల్లో నారంగ్ కూడా పాలుపంచుకోనున్నారు.
Advertisement
Advertisement