దొంగల్ని తల్వార్‌తో తరిమి కొట్టింది.. | Bhopal braveheart student chased away robbers with a sword | Sakshi
Sakshi News home page

దొంగల్ని తల్వార్‌తో తరిమి కొట్టింది..

Published Fri, Jan 9 2015 12:50 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

Bhopal braveheart student chased away robbers with a sword

భోపాల్: దోపిడీ దొంగల్ని ధైర్యంగా ఎదుర్కొని, తల్వార్‌తో తరిమికొట్టిందో యువతి. భోపాల్‌కు చెందిన చరణ్‌ప్రీత్ కౌర్ (21) ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతోంది. బుధవారం వేకువ జామున తన ఇంట్లోని రెండో అంతస్తులో కూర్చొని పరీక్షలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో ఇంట్లోకి ముసుగు దొంగలు ప్రవేశించారు.

అప్రమత్తమైన కౌర్ తన గదిలో ఉన్న నాలుగడుగుల తల్వార్ తీసుకుని అరుస్తూ వారిని వెంబడించింది. ఈ కేకలకు లేచిన ఆమె తండ్రి హర్వీందర్ కూడా మరో తల్వార్ తీసుకుని వారి వెంటబడ్డారు.  బిత్తర పోయిన దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. ఆమె ధైర్యానికి మెచ్చిన మధ్యప్రదేశ్ రాష్ర్ట హోం మంత్రి బాబూలాల్ గౌర్ గురువారం ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి చరణ్‌ప్రీత్‌ను అభినందించారు. సాహస యువతి అవార్డుకు ఆమె పేరును సిఫారసు చేయనున్నట్లు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement