సుప్రీంకోర్టు గడపతొక్కిన నితీష్ | Bihar Govt moves Supreme Court against Patna HC's order on Liquor Ban in Bihar | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు గడపతొక్కిన నితీష్

Published Mon, Oct 3 2016 11:24 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

సుప్రీంకోర్టు గడపతొక్కిన నితీష్ - Sakshi

సుప్రీంకోర్టు గడపతొక్కిన నితీష్

మద్య నిషేధం చెల్లదంటూ...బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిల్లు-2016ను తీవ్రంగా తప్పుబట్టిన పాట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నితీష్ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడపతొక్కింది. పాట్నా హైకోర్టుకు వ్యతిరేకంగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. బిహార్ ప్రభుత్వం దాఖలు చేసిన మద్య నిషేధ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం అక్టోబర్ 7న విచారించనుంది. బిహార్ను సంపూర్ణ మద్య నిషేధంగా మలుస్తానని ఎన్నికల వాగ్దానంగా నితీష్  ప్రకటించారు. వాగ్దానం మేరకు నితీష్ ఆ హామీని అమలుచేయడానికి పూనుకున్నారు.
 
కానీ మొదటి నుంచి మద్యం నిషేధంపై ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దీనివల్ల అక్రమ మద్యం వ్యాపారులు మరింత విస్తృతమవుతాయని వాదనలు వినిపిస్తున్నాయి. కాగ కఠిన నిబంధనలతోనే నితీష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.ఈ చట్టంప్రకారం దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్), దేశీయ మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. జరిమానా, జైలుశిక్ష విషయంలో వంటి కఠినమైన నిబంధనలను ఈ చట్టంలో చేర్చారు.అయితే ఈ చట్టం అమలుకోసం సర్కారు తీసుకొచ్చిన చర్యలు నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కావని పాట్నా హైకోర్టు స్పష్టం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement