2019లో ఇంతకుమించి సాధిస్తాం! | BJP chief Amit Shah addresses supporters | Sakshi
Sakshi News home page

2019లో ఇంతకుమించి సాధిస్తాం!

Published Sun, Mar 12 2017 7:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

2019లో ఇంతకుమించి సాధిస్తాం! - Sakshi

2019లో ఇంతకుమించి సాధిస్తాం!

న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికలను మించి ప్రస్తుత ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని, 2019లో ఇంతకుమించిన ఎక్కువ మెజారిటీ సాధించాలని పార్టీ నేతలు, కార్యకర్తకలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఉద్బోధించారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాలు సాధించిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ, అనంతరం సభ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు పాల్గొన్న ఈ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. దేశప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ హోలీ దేశానికి, బీజేపీ ఉజ్వలమైన పర్వదినంగా మారిందని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండా ఫలితంగానే ఈ ఎన్నికల విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. యూపీలో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించిందని, ఉత్తరాఖండ్‌లోనూ మూడింట రెండొంతుల స్థానాలను కైవలం పార్టీ కైవసం చేసుకుందని, ప్రధాని మోదీపై ప్రజల్లోని మద్దతుకు ఈ ఫలితాలు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం పేదలు, దళితుల కోసం పనిచేస్తున్నదని, ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీపై విశ్వాసాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని అమిత్‌ షా అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద ఎన్నికల విజయమని షా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement