ఆ వార్తల్లో వాస్తవం లేదు: బీజేపీ | BJP denies reports about BJP-NC leaders' meeting in Delhi | Sakshi
Sakshi News home page

ఆ వార్తల్లో వాస్తవం లేదు: బీజేపీ

Published Thu, Dec 25 2014 1:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆ వార్తల్లో వాస్తవం లేదు: బీజేపీ - Sakshi

ఆ వార్తల్లో వాస్తవం లేదు: బీజేపీ

న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ తో తమ పార్టీ అగ్రనాయకులు చర్చలు జరిపారని వచ్చిన వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి ఢిల్లీలో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు నిరాధారమని బీజేపీ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ట్విటర్ ద్వారా తెలిపారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను కలవడానికే ఒమర్ అబ్దుల్లా ఢిల్లీకి వచ్చివెళ్లారని ఆయన తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడిని కలవలేదని, ఎటువంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement