
'సీఎం పీఠం కోసం తహతహలాడుతున్నాడు'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పీఠం కోసం బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ తహతహలాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు. బుధవారం న్యూఢిల్లీలో షానవాజ్ మాట్లాడుతూ... నితీష్ అక్రమ మార్గంలో శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనట్లు హైకోర్టే తేల్చిందని తెలిపారు. నితీష్ వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో... లేదో తెలియదని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మద్దతు ఎవరికనేది అసెంబ్లీలోనే చెబుతామని షానవాజ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక చెల్లదని బుధవారం పాట్నా హైకోర్టు తీర్పు వెలువరించింది. బీహార్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షభం విషయంలో గవర్నర్ మాత్రమే జోక్యం చేసుకోగలరని హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.