ఏపీ కోటా నుంచి నిర్మలకు రాజ్యసభలో చోటు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ(స్వతంత్ర) మంత్రి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ పోటీ చేయడం ఖరారైంది. సీతారామన్‌ను ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి ఎంపిక చేస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ గురువారం ఢిల్లీలో వెల్లడించారు. ఆమె 21న నామినేషన్ దాఖలు చేస్తారు. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్న టీడీపీ నిర్మల అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెఎన్నిక దాదాపు ఏకగ్రీవమైనట్టే. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.