ఆస్ట్రేలియాలో తూర్పున ఉన్న క్రిస్టమస్ ఐలాండ్లో ఓ పడవ మునిగి 105 మంది శరణార్థులతో గల్లంతయ్యారని ఆ దేశ మేరిటైం సేఫ్టి అథారటీ ప్రతినిధి మంగళవారం మెల్బోర్న్లో వెల్లడించారు. ఆ శరణార్థులను రక్షించేందుకు నావికాదళం సహయక చర్యలు చేపట్టిందని తెలిపారు. అందుకోసం వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను రంగంలోకి దింపినట్లు చెప్పారు.
శరణార్థులతో వస్తున్న మరో నావికాదళానికి చెందిన పడవతోపాటు మరోకటి త్వరలో ఆస్ట్రేలియా చేరుకుంటాయని తెలిపారు. దేశంలోని శరణార్థుల కోసం సంక్షేమం చర్యలు చేపట్టినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం జులై నెలాఖరులో ప్రకటించింది. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్భంధంలో ఉన్న శరణార్థులను ఆస్ట్రేలియాకు తరలించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని మేరిటైం సేఫ్టి అథారటీ అధికార ప్రతినిధి వివరించారు.