టీచర్ను పొడిచి చంపేసిన కుర్రాడు!!
కారణం ఏంటో తెలియదు గానీ.. స్పెయిన్లో 14 ఏళ్ల కుర్రాడు స్కూల్లో టీచర్ను పొడిచి చంపేశాడు! అంతేకాదు, పలువురు విద్యార్థులను కూడా గాయపరిచాడు. ఈ ఘటన స్పెయిన్ రాజధాని బార్సిలోనాలోని ఓ స్కూల్లో జరిగింది. స్కూలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ దాడి కలకలం సృష్టించింది. బ్లేడు ఉన్న ఆయుధంతో టీచర్ను చంపినట్లు చెబుతున్నా.. ఆ ఆయుధం ఏంటన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు.
అయితే మీడియాలో మాత్రం అతడు చాకుతో పాటు బాణం కూడా తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ దాడిలో మరో ఇద్దరు టీచర్లు, ఇద్దరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. దాడి తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులంతా ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. ఏమైందోనన్న ఆందోళనతో తమ పిల్లలను హత్తుకున్నారు. 1999 ఏప్రిల్ 20వ తేదీన కొలరాడో ప్రాంతంలో జరిగిన దాడిలో ఒక టీచర్ సహా 12 మంది విద్యార్థులు మరణించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన వాటిలో ఇదే అతిపెద్ద దాడి.