గృహనిర్బంధంలో వేర్పాటు నేతలు | breakaway leaders under house arrest | Sakshi
Sakshi News home page

గృహనిర్బంధంలో వేర్పాటు నేతలు

Published Sun, Aug 23 2015 2:47 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

గృహనిర్బంధంలో వేర్పాటు నేతలు - Sakshi

గృహనిర్బంధంలో వేర్పాటు నేతలు

ఢిల్లీలో అదుపులోకి..
 
న్యూఢిల్లీ: పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న కశ్మీరీ వేర్పాటువాద నేతలు బిలాల్ లోన్, షబ్బీర్ షా, షా అనుచరులు ఇద్దరిని శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచాయి. మరో రెండు రోజుల్లో భారత్-పాక్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్‌ఎస్‌ఏ) మధ్య చర్చలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

శ్రీనగర్ నుంచి వచ్చిన షబ్బీర్ షా విమానం దిగగానే ఢిల్లీ పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థల అధికారులు ఆయన వద్దకు వెళ్లి ఢిల్లీలో ఎక్కడ బసచేస్తున్నారో తెలుసుకుని ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి, బయటకు రావద్దంటూ గృహనిర్బంధంలో ఉంచారు. షాతోపాటు వచ్చిన మరో ఇద్దరు వేర్పాటువాద నేతలు మహమ్మద్ అబ్దుల్లా తరీ, జమీర్ అహ్మద్ షేక్‌లను కూడా హోటల్ నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. బిలాల్ లోన్‌ను సైతం విమానాశ్రయంలో అరెస్టుచేసి దక్షిణ ఢిల్లీలోని అతని అద్దె గృహంలోనే పోలీసులు నిర్బంధించారు. కాగా, తమ బృందం తిరిగి శ్రీనగర్ వెళ్లాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని భత్రదా సిబ్బంది చెప్పారని షా అనుచరుడు జమీర్ మీడియాకు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement