డిజిటల్ బిల్లు పేమెంట్లకు బీఎస్ఎన్ఎల్ రెడీ!
Published Sat, Dec 31 2016 2:23 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
డిజిటల్ బిల్లు పేమెంట్ల ప్రోత్సహకానికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 15వేల పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల(పీఓఎస్)ను లీజుకు తీసుకోవాలని యోచిస్తోంది. వీటి ద్వారా ప్రస్తుతమున్న డిజిటల్ పేమెంట్లను రెండితలు చేసుకోవాలనుకుంటోంది. 2017 మార్చి వరకు తమ అన్ని బిల్లు చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలు 40 శాతం పెంచుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు కస్టమర్ సర్వీసు సెంటర్ల కోసం 15వేల పీఓఎస్ మిషన్లను అద్దెకు తీసుకుంటున్నామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు.
తమ టెలికాం జిల్లాలో 20 నుంచి 50 కస్టమర్ సర్వీసు సెంటర్లను కలిగి ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసు సెంటర్లలో 1,500 నుంచి 2000 పీఓఎస్ మిషన్లున్నాయి. కంపెనీ డిజిటల్ బిల్లు చెల్లింపులు మొత్తం చెల్లింపులలో 20 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. మార్చి 31 లోపలే మొబైల్, ల్యాండ్ లైన్, బ్రాండ్ బ్యాండ్, ఫైబర్ టూ హోమ్ సర్వీసుల వరకు తమ బిల్లు చెల్లింపులు 40 శాతం వరకు డిజిటల్లోనే జరిగేలా చూసుకుంటామని శ్రీవాస్తవ చెప్పారు.
Advertisement