న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రతీ ఒక్కరి సొంతమని, ఈశాన్య రాష్ట్ర విద్యార్థిపై దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ రాజధానిలో దాడికి గురై మృతిచెందిన అరుణాచల్ విద్యార్థి నిడోటినీ ఉదంతంపై కోర్టు స్వచ్ఛందంగా విచారణ చేపట్టింది. షాపు సిబ్బంది కొట్టిన దెబ్బలకే మరణించాడన్న మీడియా వార్తలపై స్పందించిన హైకోర్టు.. ఘటనకు సంబంధించిన సమాచారంతోపాటు ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రాజివ్ సహాయ్‌లతో కూడిన బెంచ్ సోమవారం కేంద్ర హోంశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
దేశ రాజధాని అందరిదీ: ఢిల్లీ హైకోర్టు
Published Tue, Feb 4 2014 12:32 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement