స్ట్రీట్ లైన్ల నుంచే సెల్ సిగ్నల్స్!
లాస్‌ఏంజెలెస్: సెల్‌ఫోన్ టవర్లపై ‘ఇంటర్నెట్’ భారం పెరుగుతోంది. 2జీ, 3జీలు దాటిపోయి.. ప్రపంచం ఫోర్ జీ వైపు అడుగులేస్తోంది. 2020 కల్లా ప్రపంచంలో సెల్యులర్ డాటా ట్రాఫిక్ ఏకంగా 900 శాతం పెరుగుతుందని అంచనా. దీంతో సెల్ టవర్ల నిర్వహణ ఆపరేటర్లకు సవాలుగా మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో అధునాతన ఆవిష్కరణలు ఈ విషయంలో కొత్త పరిష్కారాలుగా మారుతున్నాయి. లాస్‌ఏంజెలెస్‌లో స్ట్రీట్‌లైట్ల కోసం ఏర్పాటు చేసే పోల్స్‌కే సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఇచ్చే ఆంటెన్నాలను అమర్చే కార్యక్రమం మొదలైంది.
మరీ పెద్దపెద్ద సెల్‌ఫోన్ టవర్స్ స్థాయిలో కాకపోయినా, సమీపదూరాలకు పుష్కలంగా సిగ్నల్స్‌ను అందించగలవు ఈ ఆంటెన్నాలు. దీంతో భారీ ఎత్తున సెల్‌ఫోన్ టవర్లను నిర్మించాల్సిన అవసరం తగ్గడంతో పాటు, సిగ్నల్స్ విషయంలో కూడా సమస్య లేకుండా పోతుంది. ప్రస్తుతానికి ఆ నగరంలో వీటి ఏర్పాటు జరుగుతోంది. మిగతా ప్రపంచమంతా దీన్ని అందిపుచ్చుకోవడానికి అవసరంతో కూడిన ఆసక్తితో ఎదురుచూస్తోంది!