న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసే సవరణలకు బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. చట్టం పరిధిని పెంచి, పలు నేరాల శిక్షను మరింత కఠినం చేసే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బావులు, భూములు తదితర ఉమ్మడి వనరులను ఎస్సీ, ఎస్టీలు ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం.. వారిని ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించడం మొదలైన వాటిని నేరాల జాబితాలో తాజాగా చేర్చినట్లు వివరించాయి.
ఓటింగ్‌లో పాల్గొనకుండా ఎస్సీ, ఎస్టీలను అడ్డుకోవడం ఇప్పటికే ఆ చట్టం దృష్టిలో నేరం కాగా, వారిని నామినేషన్ వేయకుండా అడ్డుకోవడాన్ని ప్రత్యేక నేరంగా పరిగణించాలన్న ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని వెల్లడించాయి. కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ ఈ చట్టం అమలులో వైఫల్యం కారణంగా మెజారిటీ బాధితులకు న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిందని జాతీయ సలహా సంఘం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. కేసు నమోదు దగ్గర నుంచి విచారణ పూర్తయేంతవరకు బాధితులు, సాక్ష్యులు అనేక అవరోధాలను ఎదుర్కొంటున్నారని, శిక్ష పడుతున్న కేసుల శాతం కూడా తక్కువగా ఉంటోందని పేర్కొంది.
బీఎస్సీ (కమ్యూనిటీ హెల్త్) డిగ్రీ కోర్సుకు ఓకే!
బీఎస్సీ (కమ్యూనిటీ హెల్త్) పేరిట మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించాలన్న ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచారం. గ్రామీణ ప్రాంతా ల్లో మధ్యస్థాయి వైద్య నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సు ప్రణాళికను రూపొందిస్తారు. డాక్టర్లు పల్లెల్లో పనిచేయడానికి ఆసక్తి చూపని నేపథ్యంలో.. సామాజిక ఆరోగ్య అధికారులుగా(కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్) వీరు గ్రామాల్లో వైద్య విధులు నిర్వర్తిస్తారనే ఉద్దేశంతో చాన్నాళ్ల క్రితమే ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. కానీ పార్లమెంటరీ స్థాయిసంఘం ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో ఆరోగ్యశాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపింది.
ఎస్సీ, ఎస్టీ చట్టానికి పదును
Published Thu, Nov 14 2013 4:16 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM
Advertisement
Advertisement