రాక్గార్డెన్ సృష్టికర్త ఇక లేరు | Chandigarh's Rock Garden creator nek chand dead | Sakshi
Sakshi News home page

రాక్గార్డెన్ సృష్టికర్త ఇక లేరు

Published Fri, Jun 12 2015 7:56 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

రాక్గార్డెన్ సృష్టికర్త ఇక లేరు

రాక్గార్డెన్ సృష్టికర్త ఇక లేరు

దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన చండీగఢ్ రాక్ గార్డెన్ సృష్టికర్త నేక్ చంద్ గుండెపోటుతో మరణించారు. 90 ఏళ్ల నేక్ చంద్ మధుమేహం, రక్తపోటుతో పాటు కేన్సర్తో కూడా బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆర్కిటెక్టు మృతికి సంతాప సూచకంగా చండీగఢ్ ప్రభుత్వం తన కార్యాలయాలన్నింటికీ ఒక రోజు సెలవు ప్రకటించింది.

ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని రాక్గార్డెన్లో ఉంచారు. నేక్ చంద్ అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తారు. గత డిసెంబర్ నెలలోనే ఆయన తన 90వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ట్విట్టర్ ద్వారా నేక్ చంద్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. టర్కీలోని ఇస్తాంబుల్లో కూడా ఇక్కడి లాంటి రాక్ గార్డెన్ నమూనాను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. అంటే ఈయన స్ఫూర్తి దిగంతాలకు కూడా పాకిందన్నమాట.




Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement