
టీవీనటి దారుణ హత్య, బంగారం మాయం
చెన్నై: తమిళనాడులో సాలిగ్రాం లో దారుణం చోటు చేసుకుంది. పథకం ప్రకారం టీవీ నటిని హత్యచేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. టీవీ సీరియల్ నటి, మోడల్ డీ జయశీలి (49) ఆదివారం తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. పెరియార్ వీధిలో ఉన్న ఆమె ఫ్లాట్ నుంచి చెడువాసన రావడంతో పొరుగు వారు పోలిసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
అయితే 50 సవర్ల బంగారం మాయమైందని ఆమె సోదరుడు సెల్వరాజ్ తెలిపారు. మరోవైపు ఆమె ఒంటిమీద ఉన్న నకిలీ బంగారు ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు. తెలిసిన వాళ్ల పనే అయి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు.
నగ్నంగా, పాక్షికంగా కుళ్ళిపోయిన డెడ్ బాడీని బెడ్ మీద కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు. లైంగికదాడి అనంతరం దిండుతో అదిపి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. మరోవైపు ఇమిటేషన్ గోల్డ్ ని దుండగుడు టచ్ చేయకపోవడంతో పాటు, గదిలో పెర్ ఫ్యూం చల్లడం, సంఘటనా స్థలంలో కండోమ్ లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో విచారణ మొదలుపెట్టినట్టు చెప్పారు.