తిరుపతి పోలీసులపై ఫిర్యాదు
చిత్తూరు: తనపై తిరుపతి పోలీసులు దాడి చేశారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. పల్లిపట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం పట్టుపల్లికి వెళ్లిన చెవిరెడ్డిని తిరుపతి పోలీసులు వాహనతో ఢీకొట్టి గాయపర్చారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ఆయన ప్రస్తుతం తమిళనాడులోని పల్లిపట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడి ఘటనపై చెవిరెడ్డితోపాటు నగరి ఎమ్మెల్యే రోజా పల్లిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డిపై పోలీసుల దాడి సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పలువురు ముఖ్యనేతలు పల్లిపట్టుకు వెళ్లి చెవిరెడ్డిని పరామర్శించారు. వారిలో పెద్దరెడ్డి రమచంద్రారెడ్డి, ఈశ్వరి, దేశాయి తిప్పారెడ్డి, శ్రీకాళహస్తి పార్టీ ఇన్ చార్జి మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.