
గాల్లో విమానం..పగిలిన కాక్ పిట్ అద్దాలు
చెంగ్డు: చైనా సౌతర్న్ ఎయిర్స్లైన్స్కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. హాంకాంగ్లోని గ్వాంజోహు నుంచి బయలు దేరిన సీజెడ్ 3483 విమానం గాల్లో ఉండగానే ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో విమానం కుదుపుకు గురైంది. వడగాళ్లదాటికి విమానం ముందు భాగంతో సహా కాక్ పిట్ అద్దాలకు బీటలు వారాయి.
పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానం చైనాలోని చెంగ్డు విమానశ్రయంలో సేఫ్గా ల్యాండ్ అయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు చైనా సౌతర్న్ ఎయిర్లైన్స్ వెల్లడించింది.