అలా చేస్తే.. ట్రేడ్ వార్ తప్పదంటున్న చైనా
Published Mon, Mar 13 2017 12:12 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
బీజింగ్ : మరోసారి అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. డబ్ల్యూటీవో నిబంధనలను పక్కకుపెట్టి, ఏకపక్షంగా తమ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే అమెరికాతో ట్రేడ్ వార్ కు దిగుతామని హెచ్చరించింది. స్వంత ప్రయోజనాల కోసం డబ్ల్యూటీవో నిబంధనలను పక్కన పెట్టాలని ఎవరైనా చూస్తే, 1930 లో తలెత్తిన ట్రేడ్ వార్ మరోసారి చవిచూడాల్సి వస్తుందని వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి చెప్పారు. బహుపాక్షిక వాణిజ్య విధానాలు ఎంతమేరకు అర్థవంతం కావని పేర్కొంది. డబ్ల్యూటీవో నిర్ణయించిన నిబంధనలు పక్కనపెట్టాలని అమెరికా చూస్తున్న తరుణంలో చైనా ఈ మేర స్పందించింది. డబ్ల్యూటీవో నిర్ణయాలకు తలొగ్గని అమెరికా కొత్తప్రభుత్వం తమ కొత్త వార్షిక ట్రేడ్ పాలసీ ఎజెండాలను కాంగ్రెస్ కు పంపింది.
''అమెరికా కొత్త ట్రేడ్ చట్టాలను కచ్చితంగా అమలుచేయాలని చూస్తోంది. ఏకపక్షంగా మాపై వాషింగ్టన్ సుంకాలు విధించేందుకు సిద్దమైంది. ఒకవేళ దిగుమతులు పెరిగితే తమ దేశీయ పరిశ్రమకు తీరని అన్యాయం జరుగుతుంది'' అని స్టేట్ రన్ గ్లోబల్ టైమ్స్ ఆందోళన వ్యక్తంచేసింది. ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడిన చైనాకు వ్యతిరేకంగా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చైనా ఉత్పత్తులపై 45 శాతం సుంకాలు విధించాలని భావిస్తున్నారు. చైనా, అమెరికాలు ఒకదానిపై ఒకటి ఆధారపడిన దేశాలు, ద్వైపాక్షిక సంబంధాల ప్రభావం రెండు దేశాల మధ్యే కాకుండా ప్రపంచమంతా ప్రభావం చూపుతాయని చైనా వాణిజ్య శాఖామంత్రి జాంగ్ షా అన్నారు.
Advertisement