చెంచా చక్కెరతో 80 గంటల విద్యుత్! | Chinese students develop highly efficient battery using sugar | Sakshi
Sakshi News home page

చెంచా చక్కెరతో 80 గంటల విద్యుత్!

Published Mon, Nov 2 2015 10:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

చెంచా చక్కెరతో 80 గంటల విద్యుత్!

చెంచా చక్కెరతో 80 గంటల విద్యుత్!

బీజింగ్: ఒక చెంచాడు చక్కెరతో ఏకధాటిగా 80గంటలపాటు విద్యుత్‌ను అందించే అత్యధిక సామర్థ్యమున్న సూక్ష్మజీవి కణ వ్యవస్థను చైనా విద్యార్థులు అభివృద్ధిచేశారు. ఇందుకోసం ఈ కోలి, షెవానెల్లా, బి సబ్టిలిస్ అనే మూడు సూక్ష్మజీవుల కలయిక వ్యవస్థను తయారుచేశారు. ఈ సెల్.. లిథియం బ్యాటరీ ఇచ్చే 520ఎంవీ విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు.

కాలుష్యాన్ని విడుదలచేయని బ్యాటరీ తయారీకి కావాల్సిన వ్యవస్థను కనుగొన్నందుకు వీరు ఈ ఏడాదికి ఇంటర్నేషనల్ జనటికల్లీ ఇంజనీర్డ్ మెషీన్(ఐజెమ్) పోటీలో గోల్డ్ మెడల్‌ను గెలుపొందారు. చైనాలోని తియాంజిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 19 కళాశాల, హైస్కూల్ విద్యార్థుల బృందం ఈ కణవ్యవస్థను అభివృద్ధిచేశారు.
 

Advertisement
Advertisement