కేసీఆర్‌గారు నోట్లరద్దు ప్రభావం ఎలా ఉంది! | cm KCR meets central minister arun jaitly | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌గారు నోట్లరద్దు ప్రభావం ఎలా ఉంది!

Published Thu, Dec 8 2016 8:15 PM | Last Updated on Mon, Aug 20 2018 5:17 PM

కేసీఆర్‌గారు నోట్లరద్దు ప్రభావం ఎలా ఉంది! - Sakshi

కేసీఆర్‌గారు నోట్లరద్దు ప్రభావం ఎలా ఉంది!

న్యూఢిల్లీ: హస్తిన పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రెండో దఫా నిధుల కింద రూ. 454 కోట్లు విడుదల చేయాలని ఆయన జైట్లీని కోరారు. తెలంగాణలోని ఆర్థిక అంశాల గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెద్దనోట్ల రద్దు ప్రభావం ఎలా ఉందని సీఎం కేసీఆర్‌ను జైట్లీ ఆరా తీశారు. దీంతో నోట్ల రద్దుపై స్థానిక పరిస్థితులను జైట్లీకి కేసీఆర్‌ వివరించారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల 31తో ప్రదీప్‌చంద్ర పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని మూడునెలలపాటు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ ఇచ్చారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement