ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. అయితే న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్ ఈ రోజుంతా బీజిబీజిగా గడిపారు. బుధవారం ఉదయమే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ని కలసి రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను సీఎం కిరణ్ వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ ఆయ్యారు.