సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానంపై రాష్ట్రాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ముఖ్యంగా మహానది-గోదావరి అనుసంధానంపై ఒడిశా అభ్యం తరాలకు పరిష్కారాన్ని చూపాలని భావిస్తోంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో కీలక చర్చలు జరుగనున్నాయి. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు హాజరుకానున్నారు. మహానది పరీవాహక రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు గోదావరి పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల అభ్యంతరాలను కేంద్రం తెలుసుకోనుంది. తదనుగుణంగా ఓ కార్యాచరణను తీసుకునే అవకాశం ఉంది. మహానది-గోదావరిల కలయికలో భాగంగా ఒడిషా లో మణిభద్రా డ్యామ్‌ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించినా.. దీనివల్ల 59 వేల హెక్టార్ల భూమి ముంపునకు గురవుతోందని, ఒడిషా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది.
ప్రత్యామ్నాయంగా మణిభద్రా డ్యామ్‌కు 14 కి.మీ. ఎగువన బార్ముల్ వద్ద 80 మీటర్ల ఎత్తుతో, 42.56 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో డ్యామ్ కట్టాలని కేంద్రం సూచిస్తోంది. ఈ డ్యామ్ నుంచి 840 కి.మీ. దూరంలోని గోదావరిలో నీటిని కలిపే వరకు మధ్యలో మరో 6 డ్యామ్‌లు నిర్మించాలని ప్రతిపాదించింది. ఒడి శాకు పోను మిగిలిన 180 టీఎంసీల నీటిని గోదావరికి అనుసంధానించవచ్చని కేంద్రం చెబుతోంది. గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల జలాలను రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్, ఇచ్చం పల్లి-పులిచింతల ప్రాజెక్టులకు అనుసంధానిం చాలని భావిస్తోంది. అటునుంచి కృష్ణా, పెన్నా, కావేరీలకు తరలించవచ్చని చెబుతోంది.
అనుసంధానంపై అనుమానాల నివృత్తి!
Published Mon, Jul 13 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement