రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని అభ్యర్థిగా ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరును ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేసింది. సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. రాహుల్కు ప్రచార సారధ్య బాధ్యతలతోనే సరిపెట్టారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే విషయమై సమావేశంలో నేతలు మల్లగుల్లాలుపడ్డారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మెజార్టీ నేతలు రాహుల్ వైపు మోగ్గు చూపారు. అయితే అందుకు పార్టీ అధినేత సోనియా గాంధీ అంగీకరించలేదు.
ప్రధాని అభ్యర్థి విషయం ఎన్నికల తరువాత పరిశీలిద్దామని సోనియా గాంధీ చెప్పారు. పిఎం అభ్యర్థి బరువు బాధ్యతలు రాహుల్పై మోపవద్దని సీనియర్ నేతలను ఆమె వారించారు. ముందు 2014 ఎన్నికల బాధ్యతలు నిర్వహించనీయండన్నారు. రాహుల్ విషయం ఎన్నికల తరువాత ఆలోచిద్దామని చెప్పారు.