'దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్' | Congress looting the country: Baba Ramdev | Sakshi
Sakshi News home page

'దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్'

Published Sun, Mar 16 2014 12:20 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

'దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్' - Sakshi

'దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్'

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి బహిరంగ మద్దతు ప్రకటించారు. శనివారం న్యూఢిల్లీలో బాబా రాందేవ్ మాట్లాడుతూ... మోడీకి దేశవ్యాప్తంగా అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు.రానున్న ఎన్నికల్లో ఆయన ప్రధాని పీఠం అధిరోహించడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.

 

నల్లధనం, అవినీతిపై  దేశవ్యాప్తంగా తాను చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతిస్తుందని చెప్పారు. అధికారంలోకి రాగానే అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు చర్యల తీసుకుంటామని ఇప్పటికే ఆ పార్టీ తమకు భరోసా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీపై రాందేవ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 65 ఏళ్ల పరిపాలనలో భారతదేశాన్ని లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ తుడిచిపెట్టుకు పోతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement