భార్య లైంగిక వేధింపులు.. భర్తకు విడాకులు! | Court grants man divorce over wife's demand for excessive sex | Sakshi
Sakshi News home page

భార్య లైంగిక వేధింపులు.. భర్తకు విడాకులు!

Published Sun, Sep 7 2014 6:02 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

భార్య లైంగిక వేధింపులు.. భర్తకు విడాకులు! - Sakshi

భార్య లైంగిక వేధింపులు.. భర్తకు విడాకులు!

ముంబై:  మితిమీరిన లైంగిక వాంఛతో తనను భార్య వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ఓ భర్తకు ముంబైలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఇటీవల విడాకులు మంజూరు చేసింది. 2012లో పెళ్లి చేసుకున్న అనంతరం భార్య నుంచి వేధింపులు అధికమైనట్లు ఫిర్యాదు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. గత రెండేళ్లుగా భార్య కలిగిస్తున్న వేధింపులను భర్త వివరించడంతో  జడ్జి లక్ష్మీరావు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చాడు. దీనిపై గత జనవరిలో తనకు విడాకాలు మంజూరు చేయాలంటూ కోర్టుకు వెళ్లాడు.
 

పెళ్లయిన నాటి నుంచీ తన భార్య అంతులేని కోరికలతో వేధిస్తోందని, మరింత లైంగిక సామర్థ్యం పెరిగేందుకంటూ మద్యం, మందులు సైతం ఇచ్చేదని అతడు కోర్టుకు తెలిపాడు. అసహజ లైంగిక చర్యలకు కూడా ప్రేరేపిస్తోందని,  చెప్పినట్టు వినకపోతే తీవ్ర దుర్భాషలాడుతుందనీ విన్నవించాడు. అతని వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి వారికి విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement