ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా, వారికి బెర్జి అటవీ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు ఎదురయ్యారు. ఇరు పక్షాల మధ్య హోరా హోరీగా కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి ఎంతమంది గాయపడ్డారోనన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే మావోయిస్టుల నుంచి పోలీసులు మాత్రం భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
మావోయిస్టులు - కోబ్రా దళాల మధ్య కాల్పులు
Published Mon, Jan 20 2014 1:40 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement