పీఏసీకి సమాధానమిచ్చిన ఉర్జిత్
పీఏసీకి సమాధానమిచ్చిన ఉర్జిత్
Published Fri, Jan 20 2017 3:53 PM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన నగదు కొరత ప్రభావం త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రజాపద్దుల కమిటీకి చెప్పారు. అనుమానిత డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ, ఫైనాన్సియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ లాంటి ప్రత్యేక ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నాయని ఉర్జిత్ పేర్కొన్నారు. జీడీపీపై డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మధ్య, దీర్ఘకాలంలో నోట్ల రద్దు సానుకూల ప్రభావానే చూపుతుందని తెలిపారు. లావాదేవీలను ఛార్జీలను తగ్గించేందుకు బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లతో ఆర్బీఐ చర్చలు జరుపుతుందని పీఏసీ సభ్యులకు ఉర్జిత్ సమాధానమిచ్చారు.
పెద్ద నోట్ల రద్దు తదనాంతరం ఏర్పడిన పరిణామాలపై ప్రజాపద్దుల కమిటీకి వివరణ ఇవ్వడానికి ఉర్జిత్ పటేల్ శుక్రవారం ఆ కమిటీ ముందు హాజరయ్యారు. నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్రం, నల్లధనం వసూళ్లు, విత్ డ్రాయల్ పరిమితిపై ఆంక్షలు వంటి పలు ప్రశ్నలను ఉర్జిత్కు సంధిస్తూ ఆయనకు అంతకముందే పీఏసీ నోటీసులు జారీచేసింది. ఇదే విషయంలో బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు కూడా ఉర్జిత్ పటేల్, ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో ఉర్జిత్ పలు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్బీఐ స్వతంత్రకు ముప్పు తెచ్చే పలు ప్రశ్నలను పార్లమెంటరీ కమిటీ సంధించింది. వీటికి సమాధానం చెప్పవద్దంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాతో కొన్నింటికి ఉర్జిత్ సమాధానం చెప్పలేదు.
Advertisement
Advertisement