చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఓ వైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. సిక్కింలోని భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికులు చొరబాటుకు యత్నించారు. సిక్కిం సెక్టార్‌లోని డోంగ్‌లాండ్ (డోక్లాం) సరిహద్దు ప్రాంతంలోకి చైనా సైన్యాలు చొచ్చుకురాగా, భారత బలగాలు అంతే దీటుగా సమాధానమిస్తున్నాయి. అంతేకాకుండా హద్దుల్లో ఉండాలంటూ చైనాకు వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు భారత్‌కు భూటాన్ తన మద్దతు తెలిపింది. డోక్లాం మూడు దేశాలకు కూడలి వంటిది. ఇది భూటాన్ భూభాగం అయినప్పటికీ చైనా నియంత్రణలో ఉంది.
కాగా డోంగ్‌లాంగ్ ప్రాంతంలో భారత సైన్యం ఆక్రమణకు పాల్పడిందంటూ చైనా విదేశాంగ ప్రతినిధిలు కాంగ్ నిన్న విలేకరుల సమావేశంలో ఓ ఫొటోను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 20న ఇరుదేశాల విదేశాంగశాఖ అధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ చొరబాట్లు కొనసాగడం చైనాకు పరిపాటిగా మారింది. అంతేకాకుండా డోక్లాం సరిహద్దు నుంచి భారత్ తన సేనలను ఉపసంహరించుకోవాలని చైనా డిమాండ్ చేసింది.