న్యూఢిల్లీ: అత్యాచార బాధితుల వివరాలు వెల్లడించకూడదన్న నియమాన్ని ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి ఉల్లంఘించారు. తర్వాత పొరపాటును ఆయన సరిదిద్దుకున్నారు. డెన్మార్క్ మహిళపై మంగవారం రాత్రి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బుధవారం రాత్రి సోమనాథ్ భారతి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో బాధితురాలి పేరు పేర్కొనడంతో కలకలం రేగింది.
బాధితురాలి పేరు తొలగించాలని ఢిల్లీ పోలీసులు, డెన్మార్క్ కాన్సులేట్ కోరడంతో ఆయన పొరపాటు గ్రహించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, పొరపాటున జరిగిందని వివరణయిచ్చారు. ఆమె పేరు తొలగించి మరోసారి ప్రకటన విడుదల చేశారు. భారత్ చూసేందుకు వచ్చిన 51ఏళ్ల డానిష్ మహిళపై కొందరు ఆకతాయిలు మంగళవారం రాత్రి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
రేప్ బాధితురాలి పేరు వెల్లడించిన మంత్రి
Published Thu, Jan 16 2014 8:45 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM
Advertisement
Advertisement