
చంద్రబాబు ఫ్యామిలీ(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు- భువనేశ్వరి దంపతులు శనివారం 35వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. పెళ్లిరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మనసువిప్పి మాట్లాడారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. (తప్పక చదవండి: పెళ్లిరోజున పాత జ్ఞాపకాలు.. చంద్రబాబు మనసులో మాట)
ఇదిలా ఉంటే ఇంట్లో జరిగిన వేడుకలో మనవడు దేవాంశ్ వినూత్న రీతిలో నానమ్మ- తాతయ్యలకు శుభాకాంక్షలు తెలిపాడు.దీనికి సంబంధించిన ఫొటోను నారా లోకేశ్ తన ట్విట్టర్ లో ఉంచారు. 'మా అమ్మానాన్నల పెళ్లిరోజు సందర్భంగా వాళ్ల మనవడు దేవాంశ్ అందించిన కేక్' అంటూ లోకేశ్ పోస్ట్ చేసిన ఫొటోలోని కేక్ పై భువనేశ్వరి, బాబు దంపతులను వారి మనవడు 'భు డార్లింగ్ అండ్ తాత' అని సంబోధిస్తూ శుభాకాంక్షలు చెప్పాడు.
Celebrating the joy and togetherness of my parents on their wedding anniversary with a cake from Devaansh. pic.twitter.com/YR0m60oJ71
— Lokesh Nara (@naralokesh) 10 September 2016