ప్రత్యేక హోదా సిఫార్సు చేయలేదు: కేంద్ర మంత్రి | did not recomended for special status, says central minister | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా సిఫార్సు చేయలేదు: కేంద్ర మంత్రి

Published Fri, Apr 24 2015 6:19 PM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM

did not recomended for special status, says central minister

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని కేవలం కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించిందని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాగంటి బాబు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సరిహద్దు, కొండ, గిరిజన ప్రాంతం, ఆర్థికంగా వెనకబడిన ప్రాంతం, అల్పాదాయ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదాలు ఇస్తామని చెప్పారు.

ఏపీ, తెలంగాణ, ఒడిషా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా ప్రస్తుతం ప్రత్యేక హోదా కోరుతున్నాయని వివరించారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ, కేంద్ర పథకాల్లో మార్పులు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కొన్ని రద్దయ్యాయని, మరికొన్నింటిలో మార్పులు చేశారని అన్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించిందే తప్ప ప్రత్యేక హోదాను సిఫార్సు చేయలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement