ఈ చిన్నారి ఎవరో తెలుసా?
మూడు చక్రాల సైకిల్ మీద అన్న వెనక కూర్చుని పువ్వుల గౌను, స్వెట్టర్ వేసుకుని పెద్ద పెద్ద కళ్లతో చూస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా? కొంచెం కష్టమే. అయినా ఒక్కసారి ప్రయత్నించండి.
చిన్నతనం అంటే అందరికీ ముచ్చటే. అందులోనూ అన్నదమ్ములతో చిన్నతనంలో గడిపిన విషయాలు మళ్లీ గుర్తుచేసుకుంటే ఎంతో సరదాగా ఉంటుంది. ఆ విషయాలను పదిమందితో పంచుకోవాలని కూడా అనుకుంటారు. బీజేపీ సీనియర్ నాయకురాలు, 15వ లోక్సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్ కూడా అలాగే అనుకున్నారు. అందుకే తన అన్నయ్యతో కలిసి రెండేళ్ల వయసులో దిగిన ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. చిన్నతనం నుంచే పార్లమెంటును దులిపేసేందుకు సిద్ధమయ్యారన్న మాట అంటూ జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. దాదాపు వందమందికి పైగా ఈ ఫొటో మీద తమ వ్యాఖ్యలు పెడుతూ సుష్మాకు అభినందనలు తెలిపారు.
With my brother - It is me on the pillion as a 2 year old.http://t.co/pCFllE9jID
— Sushma Swaraj (@SushmaSwarajbjp) February 28, 2014