మోడల్కు ఉరిశిక్ష !
బీజింగ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయిన కొలంబియన్ మోడల్ జులియానా లోపేజ్కు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మత్తు పదార్థాలను కంప్యూటర్లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్లోని గాంగ్జౌ ఎయిర్పోర్ట్లో జులై 18వ తేదీన కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే లోపేజ్ ప్రస్తుతానికి ఎక్కడ ఉందో తెలిదని చైనా రేడియో ఇంటర్నేషనల్ బుధవారం వెల్లడించింది.
ఓ వేళ బీజింగ్లోని కొలంబియన్ రాయబార కార్యాలయంలో ఉండ వచ్చని అభిప్రాయ పడ్డింది. కాగా న్యాయస్థానంలో లోపేజ్ తరపున కేసు వాదించేందుకు న్యాయవాది కోసం ఆమె కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. మిస్ వరల్డ్ మెడిలిన్ పోటీల్లో లోపేజ్ పోటీదారుగా ఉన్న సంగతి ఈ సందర్భంగా మీడియా గుర్తు చేసింది.
అయితే లోపేజ్ అమాయకురాలని ఆమె స్నేహితురాలు లిస్ హెర్నాండజ్ తెలిపింది. లోపేజ్ నేరస్తురాలు కాదని తన మనసు చెబుతుందని చెప్పింది. చైనాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను స్థానిక ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. అందులోభాగంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు స్మగ్లర్లపై కఠిన శిక్షలు విధించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
పెరుగ్వే దేశానికి చెందిన 31 యువతి మత్తు పదార్ధలను అక్రమ రవాణా చేస్తు 2012లో పట్టుబడింది. దాంతో ఆమె నాటి నుంచి చైనా జైలులోనే ఉంది. ఆమెకు మరణశిక్ష విధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని మీడియా ఈ సందర్భంగా తెలిపింది.