death penalty or life imprisonment
-
పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: ‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లును రాజ్యసభ గత నెల 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు గురువారం పాసయ్యింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామని అన్నారు. ‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు. పార్టీలకు అతీతంగా అనేకమంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని ఆమె తెలిపారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. నపుంసకులుగా మార్చాలి: కిరణ్ ఖేర్ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్ఎల్పీ సభ్యుడు హనుమాన్ బేనీవాల్ మాట్లాడుతూ పోక్సో చట్టం కింద దోషులుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలనీ, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి భయం కలుగుతుందని డిమాండ్ చేశారు. నేరస్తులకు ఉరిశిక్ష విధించడం సాధ్యం కాకపోతే వారిని నపుంసకులుగా మార్చేలా నిబంధనలు ఉండాలని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ సూచించారు. -
కామాంధులకు మరణశిక్షే
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన పోక్సో చట్టం–2012 పటిష్టం కానుంది. 18 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణదండన విధించేలా పోక్సో చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ఐటీ మంత్రి రవిశంకర్ మీడియాకు చెప్పారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 5, 6(18 ఏళ్లలోపువారిపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష) సెక్షన్ 9(ప్రకృతి విపత్తుల సమయంలో చిన్నారులపై లైంగికదాడి నుంచి రక్షణ) సెక్షన్ 14, 15(చిన్నారుల అశ్లీలచిత్రాల నియంత్రణ)లను సవరించినట్లు తెలిపారు. ఈ మూడు సవరణలు లైంగికనేరాల నిరోధానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. చిన్నారుల అశ్లీల చిత్రాలను కలిగిఉన్న వ్యక్తులకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించేలా సెక్షన్ 14, 15ను సవరించారు. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు.. ► దేశంలోని కొబ్బరి రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. గుండు కొబ్బరి పంటకు అందిస్తున్న మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2,170 మేర పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ గుండు కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.7,750 ఉండగా, తాజా పెంపుతో అది రూ.9,920కు చేరుకుంది. అలాగే మిల్లింగ్ ఎండు కొబ్బరి క్వింటాల్ ధరను రూ.2,010 పెంచింది. దీంతో దీని మద్దతుధర రూ.9,521కు పెరిగింది. ► ఉల్లి ఎగుమతులపై అందిస్తున్న 5 శాతం ప్రోత్సాహకాలను 10 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► జాతీయ హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) స్థానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌సీఐఎం) ముసాయిదా బిల్లు–2018కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
ఉరిశిక్షపై జడ్జీల భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేరాలను నియంత్రించడంలో ఉరిశిక్ష విఫలమైందని ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి అభిప్రాయపడగా, మిగిలిన ఇద్దరు జడ్జీలు అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష వేయొచ్చని సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన తీర్పును సమర్థించారు. ముగ్గురిని హత్య చేసిన ఓ దోషికి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడంలో మాత్రం జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ జోసెఫ్ తన అభిప్రాయం తెలుపుతూ ‘అత్యంత అరుదైన కేసుల్లోనే మరణ శిక్ష విధించాలని 1980లోనే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొన్ని కోర్టులు అనవసరంగా దోషులకు ఉరిశిక్ష వేస్తున్నాయి. శిక్షలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఉరిశిక్ష విఫలమైంది. ఉరి శిక్షను ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశంలోనే మనం దానిని చూడాల్సిన సమయం వచ్చింది. ఉరిశిక్ష ఉన్నంతకాలం.. ఆ కేసు ఉరిశిక్ష విధించదగ్గంత అత్యంత అరుదైన, హీనమైనదేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిన భారీ బాధ్యత జడ్జీలపై ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఈ ఉరిశిక్ష హరిస్తుంది. కాబట్టి ఉరిశిక్షను విధించేటప్పుడు జడ్జీలు రాజ్యాంగానికి లోబడి అత్యంత జాగ్రత్తగా, కచ్చితంగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది’ అని అన్నారు. అయితే జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలు జస్టిస్ కురియన్ అభిప్రాయంతో విభేదించారు. 1980లోనే ఓ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉరిశిక్షను సమర్థించిందనీ, ఐపీసీలో ఉన్న ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష విధించొచ్చని నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనీ, దీన్ని ఇప్పుడు మళ్లీ పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. -
బాలికల రేపిస్టులకు మరణశిక్ష
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేందుకు వీలు కల్పించే కీలకమైన క్రిమినల్ లా (సవరణ) బిల్లు–2018ను బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో దోషులకు కఠిన శిక్షలు విధించేలా ఏప్రిల్ 21 తేదీన కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో రూపొందించిన ఈ బిల్లులో 12, 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలుండేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ‘12 ఏళ్లలోపు బాలికలపై రేప్‌నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి బతికినంత కాలం జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్‌రేప్ నిందితులకు జీవితాంతం జైలు. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష’ అమలవుతుంది’ అని చెప్పారు. ఈ కేసుల్లో దర్యాప్తు, విచారణ వేగంగా పూర్తయ్యేందుకు కూడా నిబంధనలున్నాయి. అత్యాచార కేసులన్నిటినీ రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూకహత్యల దోషులకు మరణ శిక్ష: మంత్రి మూకహత్యల కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ వెల్లడించారు. -
మోడల్‌కు ఉరిశిక్ష !
బీజింగ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయిన కొలంబియన్ మోడల్ జులియానా లోపేజ్‌కు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మత్తు పదార్థాలను కంప్యూటర్లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్‌లోని గాంగ్జౌ ఎయిర్‌పోర్ట్‌లో జులై 18వ తేదీన కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే లోపేజ్ ప్రస్తుతానికి ఎక్కడ ఉందో తెలిదని చైనా రేడియో ఇంటర్నేషనల్ బుధవారం వెల్లడించింది. ఓ వేళ బీజింగ్‌లోని కొలంబియన్ రాయబార కార్యాలయంలో ఉండ వచ్చని అభిప్రాయ పడ్డింది. కాగా న్యాయస్థానంలో లోపేజ్ తరపున కేసు వాదించేందుకు న్యాయవాది కోసం ఆమె కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. మిస్ వరల్డ్ మెడిలిన్ పోటీల్లో లోపేజ్ పోటీదారుగా ఉన్న సంగతి ఈ సందర్భంగా మీడియా గుర్తు చేసింది. అయితే లోపేజ్ అమాయకురాలని ఆమె స్నేహితురాలు లిస్ హెర్నాండజ్ తెలిపింది. లోపేజ్ నేరస్తురాలు కాదని తన మనసు చెబుతుందని చెప్పింది. చైనాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను స్థానిక ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. అందులోభాగంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు స్మగ్లర్లపై కఠిన శిక్షలు విధించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెరుగ్వే దేశానికి చెందిన 31 యువతి మత్తు పదార్ధలను అక్రమ రవాణా చేస్తు 2012లో పట్టుబడింది. దాంతో ఆమె నాటి నుంచి చైనా జైలులోనే ఉంది. ఆమెకు మరణశిక్ష విధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని మీడియా ఈ సందర్భంగా తెలిపింది.