రాయ్పూర్: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం పోలీసులు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ ఎడిషనల్ ఎస్పీ ఇందిర కళ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులతో దాడికి పాల్పడడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.
దీంతో మావోయిస్టులు దండకారణ్యంలోకి పారిపోయారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో నక్సల్స్కు సంబంధించిన బాంబులు, బ్యాగులు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయని.. మావోయిస్టులు గాయపడి లేదా మరనించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.