
చాంపియన్స్ ట్రోఫికి జో ‘రూట్‘
లండన్: చాంపియన్ ట్రోఫిలో భాగంగా బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్ మోన్ జోరూట్ సెంచరీ సాధించి టోర్నిలో ఇంగ్లండ్ విజయాలకు రూట్ వేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హెల్స్‌లు అర్ధ సెంచరీలు సాధించడంతో బంగ్లాపై సునాయసంగా విజయం సాధించింది. 306 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ జాసన్ రాయ్(1) నిరాశపర్చగా మరో ఓపెనర్ అలెక్స్ హెల్స్, జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
సెంచరి మిస్ చేసుకున్న అలెక్స్(86 బంతుల్లో11 ఫోర్లు, 2 సిక్సర్లతో 95) పరుగులు చేసి షబ్బీర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ విజయం సులువైంది. జోరూట్ 115 బంతుల్లో శతకం సాధించగా, మోర్గాన్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం రెచ్చిపోయి ఆడిన వీరిద్దరూ 47.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించారు. జోరూట్ 133(129 బంతులు 11 ఫోర్లు, ఒక సిక్స్), మోర్గాన్ 75(61 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్సులు)
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(128;142 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్(79;72 బంతుల్లో 8 ఫోర్లు) లు బాధ్యాతయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరును ఇంగ్లండ్ ముందుంచారు.