ఢిల్లీలో మహిళలకు భద్రతేదీ: మమతాశర్మ | ensure women safety in delhi, asks mamata sharma | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మహిళలకు భద్రతేదీ: మమతాశర్మ

Published Wed, Jan 15 2014 12:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

ensure women safety in delhi, asks mamata sharma

దేశ రాజధాని నగరంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ మండిపడ్డారు. ఢిల్లీలో ఓ డేనిష్ మహిళపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనపై ఆమె స్పందించారు.

రాజధాని నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని, వారి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల భద్రత కోసం ఆప్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను సైతం ఏర్పాటుచేసింది. అయినా కూడా ఇంకా అక్కడ అత్యాచారాల పర్వం ఆగలేదు. తాజాగా డేనిష్ మహిళపై అత్యాచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement