
ఆల్ఫోన్సో రకం మామిడి పండ్లు
లండన్: భారత మామిడి ఉత్పత్తిదారులపై ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ తీసుకుంది. 28 దేశాల యూరోపియన్ యూనియన్ భారత్ నుంచి ఆల్ఫోన్సో రకం మామిడికాయల దిగుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.
అలాగే కూరగాయలు వంకాయ, చేమ, కాకరకాయ, దోసకాయల దిగుమతులపై కూడా తాత్కాలిక నిషేధం విధించారు.ఈ నిషేధం మే 1 నుంచి అమలులోకి వస్తుంది.