న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పీ కే తుంగన్కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అజయ్ కుమార్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. 68 ఏళ్ల తుంగన్కు జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న టలీ, సంగీత్కు చెరో మూడున్నరేళ్లు, మరో నిందితుడు మహేష్ మహేశ్వరికి రెండున్నరేళ్లు చొప్పున జైలు శిక్ష వేశారు.
1998లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయం మంత్రిగా ఉన్న తుంగన్ 2 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తుంగన్ దోషీగా తేలడంతో శిక్ష ఖరారు చేశారు.
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేళ్లు జైలు
Published Mon, Jul 27 2015 6:06 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement