అశ్లీల చిత్రాలను నిరోధించేందుకు...
న్యూయార్క్: ఇంటర్నెట్ లో పిల్లల అశ్లీల చిత్రాలను నిరోధించేందుకు ఆన్ లైన్ దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి. చైల్డ్ ఫోర్న్ సైట్లను నియంత్రించేందుకు ఫేస్ బుక్, గూగుల్, మైక్రో సాఫ్ట్, యాహూ, ట్విటర్ చేతులు కలిపాయి. ఇందుకోసం బ్రిటన్ కు చెందిన ఇంటర్నెట్ వాట్ ఫౌండేషన్(ఐడబ్ల్యూఎఫ్) తో కలిసి కొత్త టెక్నాలజీని రూపొందించింది.దీని ద్వారా చైల్డ్ ఫోర్నోగ్రఫీ చిత్రాలను గుర్తించి, నియంత్రించడానికి వీలవుతుంది.
అశ్లీల చిత్రాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలను హేష్ టాగ్ లను గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా గుర్తించిన హేష్ టాగ్ లను ఐదు కంపెనీలకు అందజేస్తుంది. ఈ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తే ఫేస్ బుక్, ట్విటర్ ఇతర వెబ్ సైట్లలో అప్ లోడ్ అయ్యే ఫోర్న్ చిత్రాలను గుర్తించి, నిరోధించడం ఆటమేటిగ్గా జరుగుతుంది. చైల్డ్ ఫోర్నోగ్రఫీని సమర్థవంతంగా అడ్డుకునేందుకు మిగతా కంపెనీ సహకారం తీసుకోవాలని ఐడబ్ల్యూఎఫ్ భావిస్తోంది.