హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఒకే విడతలో అమలు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్కున్న నిధులు రుణమాఫీకి ఎందుకులేవని ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్లో భారీస్థాయి కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.
ఇప్పటి వరకు సుమారు 1400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం ఆ సంఖ్యను తగ్గిస్తే సహేంచేది లేదని దుయ్యబట్టారు. 30 వేల కోట్ల టెండర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు తప్ప మరొకరికి సమాచారమే లేదని విమర్శించారు. రూ. వేల కోట్ల కమీషన్ల కోసమే వాటర్గ్రిడ్ కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేసిందన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.
'ఒకే విడతలో రైతు రుణాలు మాఫీ చేయాల్సిందే'
Published Thu, Oct 1 2015 3:04 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement