- పదకొండు మంది రైతుల బలవన్మరణం
సాక్షి నెట్‌వర్క్: అప్పులకు తోడు వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు వివిధ జిల్లాల్లో వేర్వేరు చోట్ల మొత్తం పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన మేడ రాధ(50), చేర్యాల మండలం పెద్దరాజుపేటకు చెందిన బండకింది స్వామి(69), కరీం నగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయికి చెంది న చిలుక రామమ్మ(47), నల్లగొండ జిల్లా నర్సింగ్‌భట్లకి చెందిన తిరుమల సత్యనారాయణ(25), రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికి చెందిన రైతు మహ్మద్ ఖాసీం(40), నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం లక్ష్మిదేవునిపల్లి గ్రామానికి చెందిన రైతు గడ్డం లింబారెడ్డి(64), మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని కుమ్మరోనిపల్లికి చెందిన గెంటెల గోపాల్(33), ఇదే జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్‌కి చెందిన జమ్మత లక్ష్మయ్య(41), కొందుర్గు మండలం పద్మారం గ్రామానికి చెందిన రైతు బొమ్మగళ్ల నరేందర్ (32), ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(టి)కి చెందిన గాదం మల్లయ్య(48) బల వన్మరణాలకుపాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం రంగసాగర్‌కి చెందిన రైతు ఓరగంటి నారాయణ(45) గుండెపోటుకు గురయ్యారు.
రైతు ఇంట మృత్యుఘోష
Published Wed, Sep 30 2015 4:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement