దారుణం: కొడుకులే కర్కోటకులై..! | father attacked brutally in karnataka | Sakshi
Sakshi News home page

దారుణం: కొడుకులే కర్కోటకులై..!

Published Thu, Jul 13 2017 2:08 PM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM

దారుణం: కొడుకులే కర్కోటకులై..! - Sakshi

దారుణం: కొడుకులే కర్కోటకులై..!

ఆస్తి కోసం తన మన బేధాలు మరిచిపోయారు. కన్న కొడుకులే కర్కోటకులుగా మారారు. తండ్రి అన్న జాలి కూడా లేకుండా.. వృద్ధుడనే దయ కూడా చూపకుండా రాక్షసుల్లా ప్రవర్తించారు. చేతులుకాళ్లు కట్టేసి ఈడ్చుకుపోయారు. ఉత్తర కర్నాటకలోని నింగపుర గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం ఇద్దరు కొడుకులు తండ్రిని దారుణాతి దారుణంగా కొట్టారు. ఇంటి దగ్గర కిందపడేసి కాళ్లు చేతులు కట్టేసి.. పొలం వరకూ ఈడ్చుకుపోయారు. ఇద్దరు కొడుకుల రాక్షసకాండను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటకలోని బగల్ కోట్ ప్రాంతంలోని నింగపురం గ్రామానికి చెందిన షేకప్ప మనగూళి (80)కు ఇద్దరు కొడుకులు. ఆయనకు భూమి, ఇల్లు ఉన్నాయి. ఆస్తి మొత్తం ఆయన పేరుతోనే ఉంది. ఆస్తులు పంచాలని కొడుకులు కన్నప్ప, ఎల్లప్ప ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తున్నారు. తాను చనిపోయిన తర్వాతే ఆస్తులు పంచుకోవాలని.. అప్పటివరకు రాసి ఇవ్వనని తేల్చేశాడు షేకప్ప. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకులు.. తండ్రిని రోడ్డుపైకి లాగారు.

కింద పడేసి కర్రలు, రాళ్లతో కొట్టారు. ఓ కొడుకు కాళ్లు పట్టుకుంటే.. మరో కుమారుడు చేతులు పట్టుకుని కొట్టాడు. గ్రామస్తులు అందరూ చూస్తుండగానే ఈ తంతు జరిగింది. చేతులు, కాళ్లను కట్టేసి.. అలాగే మోసుకెళ్లి ఊరిచివర ఉన్న పొలంలో పడేసి వచ్చారు. ఆస్తి రాసిస్తేనే ఇంటికి తీసుకొస్తామని.. లేదంటే అక్కడే చావు అని చెప్పారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరించిన ఊరిలోని కుర్రోళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఇద్దరి కొడుకులను అరెస్ట్ చేశారు. పొలంలోని పెద్దాయనను ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తి కోసం 80 ఏళ్ల కన్నతండ్రిని.. ఈ రకంగా హింసించటం దారుణం అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement