విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఈ ఏడాది మార్చిలో 40 శాతం తగ్గాయి. గత ఏడాది మార్చిలో 353 కోట్ల డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు
గత ఆర్థిక సంవత్సరం 27 శాతం వృద్ధి -డీఐపీపీ వెల్లడి
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఈ ఏడాది మార్చిలో 40 శాతం తగ్గాయి. గత ఏడాది మార్చిలో 353 కోట్ల డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు ఈ ఏడాది మార్చిలో 40 శాతం తగ్గి 211 కోట్ల డాలర్లకు పడిపోయాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) పేర్కొంది. డిఐపీపీ వెల్లడించిన గణాంకాల ప్రకారం..., గత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో ఇదే తక్కువ మొత్తం. కాగా గతేడాది నవంబర్‌లో 153 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు 27 శాతం పెరిగాయి.