చెవులు కోసిన ఆమెను... ఏం చేసిందో తెలుసా? | Female bullfighter toppled by beast a year later | Sakshi
Sakshi News home page

చెవులు కోసిన ఆమెను... ఏం చేసిందో తెలుసా?

Published Mon, Oct 17 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

చెవులు కోసిన ఆమెను... ఏం చేసిందో తెలుసా?

చెవులు కోసిన ఆమెను... ఏం చేసిందో తెలుసా?

లియా విసెన్స్‌.. ఈ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది జంతుప్రేమికులు ఉలిక్కిపడతారు. అందుకు కారణం ఆమె కిరాతకంగా ఓ దున్నపోతును చంపడమే కాకుండా.. ఆ దున్నపోతు చెవులు కోసి.. వాటిని చేతిలో పట్టుకొని గర్వంగా ఫొటో దిగింది. ఈ ఫొటోతో విస్మయపోయిన జంతుప్రేమికులు ఆమె తీరుపై భగ్గుమన్నారు. ఇప్పుడు సాటి దున్నపోతే ఆమె మీద పగ తీర్చుకుంది.

స్పెయిన్ జరాగోజాలోని లా మిజెరికార్డియాలో ఎల్‌ పిలార్ ఫెరియా టోర్నమెంటు పేరిట దున్నపోతులను హింసించే అతి కిరాతకమైన క్రీడ జరుగుతుంది. గుర్రం మీద స్వారీ చేసే బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడిచి పొడిచి హింసిస్తారు. ఈ క్రీడలో భాగంగా 31 ఏళ్ల లియా విసెన్స్‌ గత ఏడాది గుర్రంపై స్వారీ చేస్తూ ఓ దున్నపోతును ఇలా పొడిచి పొడిచి చంపేసింది. అంతేకాకుండా ఆ దున్నపోతు చెవులను కోసి.. వాటిని గర్వంగా పట్టుకొని ఫొటో దిగింది. ఈ కిరాతకమైన ఫొటో చూసి జంతు ప్రేమికుల ఒళ్లు జలదరించింది. ఆమె తీరుపై వారు భగ్గుమన్నారు.

ఈ ఏడాది క్రీడలో సాటి దున్నపోతు తన పవర్‌ ఏంటో ఆమెకు రుచి చూపించింది. గుర్రంపై స్వారీ చేస్తూ.. లియా విసిరిన శూలం పోట్లను తప్పించుకుంటూ ఆమెకు చుక్కలు చూపించింది. గుర్రాన్ని కుమ్మేసి.. ఆమెను కిందపడేసింది. కొమ్ములతో ఆమెను పొడిచేందుకు ప్రయత్నించింది. క్షణాల్లో ప్రాణాలు పోయేవే. కానీ, క్రీడా సిబ్బంది తక్షణమే స్పందించి ఆమెకు రక్షణగా రావడంతో లియాకు ప్రాణాపాయం తప్పింది. కానీ, గత ఏడాది ఆమె చూపిన దుర్మార్గ చర్యకు ఈ ఏడాది సాటి దున్నపోతే పగ తీర్చుకుందని జంతు ప్రేమికులు వ్యాఖ్యానిస్తున్నారు.









 

తాను చంపేసిన దున్నపోతు చెవులతో (గత ఏడాది ఫొటో)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement