భారీ వర్షాలు, వరదల వల్ల కాబుల్ ప్రాంతంలో 20 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహాణ సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ దయెం కాకర్ ఆదివారం కాబుల్లో వెల్లడించారు. షకదార, పమన్ జిల్లాలను వరదలు ముంచెత్తడంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారని తెలిపారు. అలాగే వేలాది ఏకరాల పంట నీట మునిగిందని చెప్పారు. అయితే గతవారం నంగార్హర్, కొస్ట్ ప్రావెన్స్లోని భారీగా వర్షాలు కురిశాయి. దాంతో ఒక్క సరోబి జిల్లాలోనే 69 మంది మరణించిన సంగతిని కాకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.